జాకీ స్టైలిష్.. యాక్షన్
14-09-2026 | 05:30am
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers)తమిళంలో తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధ్రువ్ విక్రమ్‌తో (Kollywood star Dhruv Vikram) తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘జాకీ’. అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నో రీటేక్స్ అలౌడ్’ అనేది ట్యాగ్‌లైన్‌గా నిర్ణయించారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ధ్రువ్ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; డీవోపీ: వికీ; యాక్షన్: విక్రమ్ మోర్; ఎడిటింగ్: జయసూర్య ఎస్.