04-02-2026 01:33:09 PM
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker Gaddam Prasad Kumar) అనర్హత పిటిషన్ పై ఇచ్చిన తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Jagityala MLA Sanjay) స్పందించారు. ''నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన.. నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే'' అని సంజయ్ మరో సారి స్పష్టం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ... అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు పెట్టి విప్ జారీ చేస్తే మద్దతు ఇస్తానని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
జగిత్యాల అభివృద్ధి కోసం తాను సీఎంను కలిసేందుకు వెళ్తే అక్కడ రేవంత్ రెడ్డి తనకు పార్టీ కండువా కప్పితే తాను కాంగ్రెస్ లో చేరానని బీఆర్ఎస్ నేతలు(BRS leaders) తన ఇళ్లు, ఆస్పత్రిపై రచ్చరచ్చ చేసి తన దిష్టి బొమ్మ దహనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వివరణ ఇచ్చేందుకు తనకు ఒక అవకాశం, నోటీసులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) వేసిన అనర్హత పిటిషన్ ను తెలంగాణ స్పీకర్ బుధవారం నాడు కొట్టివేశారు. అటు కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత పిటిషన్ విచారణ కూడా వాయిదా పడింది.