ఓటరు జాబితా సవరణపై బీఎల్‌ఏలకు జైపాల్ యాదవ్ దిశానిర్దేశం
ఆమనగల్లు, జులై 14(విజయక్రాంతి): ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్య క్రమంపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సమీక్ష సమావేశం మంగళవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని కళ్యాణి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సర్ ఇన్చార్జి రజిని సాయి చందు లు హాజరై బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ప్రతి అర్హుడికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే అనర్హుల పేర్లను గుర్తించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యంతరాలు వ్యక్తంచేయాలని సూచించారు. బూత్ల వారీగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్ రావు, స్థానిక నాయకులు లక్ష్మీనరసింహారెడ్డి, సయ్యద్ ఖలీల్, శ్రీనివాస్ యాదవ్, విజితా రెడ్డి, సాయిలు, సైదులు గౌడ్, బాలస్వామి నాయకులు పాల్గొన్నారు.






