13 June, 2026 | 3:04 PM

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్

13-06-2026 01:56 PM

న్యూఢిల్లీ: భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులను భారత్ మరోసారి తప్పుబట్టింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar Protests US Attacks) అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. జైశంకర్ అమెరికా దాడులపై నిరసన తెలియజేశారు. వాణిజ్య నౌకలపై దాడులు సమర్థనీయం కాదని అమెరికాకు జైశంకర్ హెచ్చరించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతిచెందారు. భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆరోపించారు. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని ఇరాన్ ఖండించింది.