14 June, 2026 | 3:01 AM

ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ సమరం

14-06-2026 01:07 AM
  1. 17 నుంచి కార్యాచరణ అమలు
  2. కేంద్ర సర్కార్‌ను వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ
  3. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వం

న్యూఢిల్లీ, జూన్ ౧౩: నీట్ యూజీ వంటి ముఖ్యమైన ప్రశ్నాపత్రాల లీకేజీపై కాంగ్రెస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. కేంద్ర విద్యాశాఖతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగానే కోటా నుంచి ఢిల్లీ వరకూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈనెల 17న రాజస్థాన్‌లోని కోటా నుంచి ఈ క్యాంపెయిన్ మొదలు కానున్నది.

అది మొదలు.. రాహుల్‌గాంధీ ప్రయాగ్‌రాజ్, పాట్నా, ఢిల్లీలోని విద్యాలయాలకూ వెళ్లనున్నారు. ము ఖాముఖిల్లో రాహుల్  పరీక్షల నిర్వహణలో కేంద్ర విద్యాశాఖ వైఫల్యాలను ఎండగట్టనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ముఖ్యమైన పరీక్షలకు ఫీజు రద్దు చేయాలని, పరీక్షల వి కేంద్రీకరణ పెరగాలని రాహుల్‌గాంధీ డి మాండ్ చేస్తారని, పదే పదే జరుగుతున్న పరీక్షల అక్రమాలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలని నిలదీయనున్నారని తెలిసింది. అలాగే, రాహుల్ పరీక్షలపై పక్కా జవాబుదారీతనం రావాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తారని, పేపర్ లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముం దు నిలబెట్టే వరకు పోరాటం సాగిస్తారని సమాచారం.