కేసీఆర్ బస్సుయాత్రకు జననీరాజనం

26-04-2024 12:58:49 AM

l వేలాదిగా తరలివస్తున్న స్థానిక ప్రజలు

l అట్టహాసంగా సాగిన రెండో రోజు యాత్ర

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేపట్టిన బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర అట్టహాసంగా కొనసాగుతోంది. తొలిరోజు మిర్యాలగూడలో ప్రారంభమై సూర్యాపేట వరకు యాత్ర సాగింది. మార్గమధ్యలో రైతులను పరామర్శిస్తూ వారి కష్టాలు, బాధలను తెలుసుకుంటూ కేసీఆర్ ఓదారుస్తూ సాగారు. గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి,  తిరుమలగిరి, జనగాం మీదు గా భువనగిరికి చేరుకుని అధికార కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరువు తీసుకొ చ్చిన కాంగ్రెస్ పాలనను అంతం చేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మార్గమధ్యలో సూర్యా పేట మండలం ఎర్కారం సమీపంలో దుబ్బతండా రైతు ధరావత్ నర్సింహాను కేసీఆర్‌ను కలిశారు. తన పొలానికి నీళ్లందక పంట పూర్తిగా ఎండిపోయిందని ఈ సందర్భంగా రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కంట నీరు పెట్టుకున్న అన్నదాతకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, భయపడాల్సిన అవసరం లేదని భుజం తట్టారు. 

ఔరా అనిపించేలా ప్రసంగాలు 

కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర విజయవంతంపై ప్రారంభంలో పార్టీ సీని యర్లు కాస్త సంకోచించారు. కానీ పార్టీ అధినేత మాత్రం ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారిని ఈ సమయంలో ఓదార్చితే తమకు మద్దతుగా నిలుస్తారని ముందడుగు వేశారు. దీం తో యాత్రకు సంబంధించిన ఏర్పా ట్లు చేసి మిర్యాలగూడ నుంచి శ్రీకారం చుట్టడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కేసీఆర్ ప్రసంగాలకు ప్రజలు మంత్ర ముగ్ధులవుతున్నారని అసెంబ్లీ సమన్వయకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.