‘నిజాం షుగర్స్’ తిరిగి తెరిపిస్తాం

26-04-2024 12:57:04 AM

l హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచేందుకు కాంగ్రెస్ కుట్ర

l మోదీ పాలనలో తీవ్రవాదంపై ఉక్కుపాదం

l సైన్యం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు

l ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

l ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గల్ఫ్ బాధితులపై ప్రేమ: ధర్మపురి అర్వింద్

నిజామాబాద్,ఏప్రిల్25 (విజయక్రాంతి): ఆసియాలో అతిపెద్ద పరిశ్రమ అయిన బోధన్‌లోని ‘నిజాం షుగర్స్’ను తిరిగి తెరిపిస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి హమీ ఇచ్చారు. నిజామా బాద్‌లో గురువారం ఆయన బీజేపీ ఓబీసీసెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌తో కలెక్టరేట్‌లో నామినేషన్ వేయించారు. అనంతరం నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడారు. నాలుగు దశాబ్దాల పసుపు రైతులు ఆకాంక్షను పసుపు బోర్డు ద్వారా నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లా అమలు చేసేందుకు ఉవ్విళ్లూతోందని ఆరోపించారు. పార్టీ అభ్యర్థి అర్వింద్ ఈ ఎన్నికల్లో గతంలో కన్నా ఎక్కువ మోజార్టీతో గెలువబోతున్నారని జోస్యం చెప్పారు.

మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. తమ ప్రభుత్వం తీవ్రవాదాన్ని పూర్తిగా అరికట్టిందన్నారు. సైన్యం స్వేచ్ఛగా నిర్ణయా లు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మైనార్టీల అభివృద్ధికి వాడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలను దోచుకు ని, దాచుకునే విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ కుంభకోణాలకు అడ్డాగా మారిందన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తామని పగటి కలలు కంటోందని, వారి కలలు కల్లలేనని ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరన్నారు.

ఐదేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా, ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ సాధించేం దుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని, మున్ముందు ఆ కల నెరవేరుస్తామన్నారు. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గల్ఫ్ కార్మికులపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకువచ్చిందన్నారు. పసుపు బోర్డు ఏ శాఖ పరిధిలో ఉంటుందో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. సభలో నిజామాబా ద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, నాయకులు పాల్గొన్నారు. 

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు: ధర్మపురి అర్వింద్

నిజామాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పిందని, అయినప్ప టికీ కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రయత్నిస్తోం దనిఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మత రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనేక సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో జూన్ 24న కోర్టు నుంచి తీర్పు వెలువడనున్నందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మతిలేకుండా బీజేపీపై ఛార్జ్‌షీట్ వేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి పదవి పోతుందని ఆయన పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లింలకు అనుకూలంగా ఉందని,  మ్యానిఫెస్టో ద్వారా భారత్‌ను తాలిబాన్లకు అడ్డాగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నా రు. దీనిలో భాగంగానే భారత్ ప్రపంచంలోనే  అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. మోదీ పాలనలో భారత్ అయిదో స్థానం నుంచి మూడోఆర్థిక వ్యవస్థగా మారబోతున్నదన్నారు.  రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో విధంగా మాట్లాడుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి, ఇప్పుడు రుణమాఫీ పథకాన్ని ఆగస్ట్ 15కు వాయి దా వేసిందన్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మోదీ ప్రభుత్వమేనన్నారు. సమావేశంలో అర్బన్ ఎమెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ, పార్టీ నేతలు పల్లె గంగారెడ్డి, దినేష్, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.