14 August, 2026 | 2:47 PM

భద్రాచలంలో జనసేన నియోజకవర్గస్థాయి సమావేశం

14-08-2026 01:41 PM

పాల్గొననున్న  రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి 

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో ఆగస్టు 15 తేది నాడు భద్రాచలం నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం చర్ల రోడ్డులో ఉన్నటువంటి కేకే ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన నాయకులు బండి రాంప్రసాద్ అల్లాడి వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బోలోపేతం చేయటానికి అవసరమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్ష,  కార్యదర్శులు నేమూరి శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి గడల శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి  పాల్గొని కార్యకర్తలకు జనసేన పార్టీ అభివృద్ధిపై దిశా నిర్దేశం  చేస్తారని తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల సమస్యలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించ నున్నట్టు కూడా  వారు తెలిపారు. ఉదయం 11 గంటలకు బ్రిడ్జి సెంటర్ నుండి కేకే ఫంక్షన్ హాల్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బండారు శ్రీకాంత్, పొంది వంశీ , డేగల శివ ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.