14 August, 2026 | 3:00 PM

కోట గుళ్ళు లో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు

14-08-2026 01:57 PM

భారీగా తరలివచ్చిన భక్తులు 

స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ 

గణపురం,ఆగస్టు14 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాసం తొలి శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించగా 

పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణపతి, నందీశ్వరుడు గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారిని వివిధ రకాల పూలు పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి శ్రావణ శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.