16 March, 2026 | 9:14 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

డ్రైవర్‌పై ట్రాఫిక్ ఎస్సై బూతు పురాణం

18-07-2024 08:48 PM

హైదరాబాద్ : జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుధవారం గండిమైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో అనుకోకుండా నో పార్కింగ్ ప్లేస్‌లో వాహనం ఆపాడు. ఇది గమనించిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి డ్రైవర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ చెంప చెల్లుమనిపించడంతో పాటు బండ బూతులు తిట్టాడు. దీంతో అగ్రహించిన ఇతర రాష్ట్ర డ్రైవర్లు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

బదిలీ వేటు..

లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన వీడియో వైరల్ కావడం, మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేయడంతో సదరు ట్రాఫిక్ పోలీస్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.