24 July, 2026 | 6:37 PM

ఉట్నూర్ మండల బూత్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

24-07-2026 06:03 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉట్నూర్ మండల బూత్ లెవెల్ ఏజెంట్లతో  సర్వే సమీక్ష SIR నియోజకవర్గ ఇంచార్జి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిర్వహించారు. ప్రతి బూత్ లో 100% సర్వే పూర్తి చేయుటకు కృషి చెయ్యాలని దిశ నిర్దేశం చేశారు. నియోజకవర్గ SIR సర్వే నివేదికను ఇంచార్జికి అందజేశారు. ప్రతి రోజు సర్వే నివేదిక అందించాలి అని బూత్ ఏజెంట్లకు  ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు,బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు.