17 July, 2026 | 11:58 AM

హైవేపై బొలెరో–లారీ ఢీ: జెర్సీ ఆవులకు గాయాలు

17-07-2026 11:58 AM

చివ్వెంల, జూలై 17 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం సమీపంలోని నేషనల్ హైవే–365పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జెర్సీ ఆవులు గాయపడగా, డైరీ ఫార్మ్ యజమానికి కాలు విరిగింది. వివరాల ప్రకారం, జెర్సీ ఆవులను తరలిస్తున్న బొలెరో వాహనం (AP39WD9519) టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ (AP39WN4189) బొలెరోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బొలెరోలో మొత్తం 5 జెర్సీ ఆవులు, 3 చిన్న దూడలు ఉండగా, వాటిలో 2 జెర్సీ ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని ఓ డైరీ ఫారంకు వాటిని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో డైరీ ఫార్మ్ యజమానికి కాలు ఫ్రాక్చర్ కాగా, సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.