ఎంపీ రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరికలు
02-12-2024 01:50 PM
పటాన్ చెరు, (విజయక్రాంతి) : మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన సుమారు యాబై మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల యువకులు మండల నాయకుడు నలగండ్ల అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బీజేపీలో చేరారు. వీరికి ఎంపీ రఘునందన్ రావు కండువాలు వేసి బీజేపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సతీష్, సంపత్, విక్రమ్, వంశీ, శివశంకర్, ఓంకార్, సత్యనారాయణ, వరుణ్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరి రాజు, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.




