అన్నదాతల్లో ఆనందం..
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ
మహబూబాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో దశ నిధులను విడుదల చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఒక ఎకరం విస్తీర్ణం కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు 6000 చొప్పున జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లు సెల్ఫోన్ కు మెసేజ్ వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో మొదటి, రెండో దశ రైతు భరోసా పథకం ద్వారా 2.15 లక్షల రైతులకు రూ.176.80 కోట్లు జమ
మహబూబాబాద్ జిల్లాలో మొదటి, రెండో దశల కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి దశ 25 లో జమ కాగా, రెండో దశ సాగు పెట్టుబడి పైకం మంగళవారం నుండి డీబీటీ (రైతు వ్యక్తిగత బ్యాంకు ఖాతా) ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి.
జిల్లాలో మొదటి, రెండో దశకు కలిపి మొత్తం 2,15,752 మంది రైతులకు రూ.176,80,14,169 రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా మరిపెడ మండలంలో నిధులు జమ కాగా, తక్కువగా చిన్నగూడూరు మండలంలో రైతులకు నిధులు అందాయి. రైతులకు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సరిత తెలిపారు
మండలాల వారీగా ఇప్పటివరకు మొదటి, రెండో దశ రైతు భరోసా నిధుల వివరాలు
బయ్యారం 12,403 రైతులకు రూ.12.34 కోట్లు.
గంగారం 6,148 రైతులకు రూ.6.16 కోట్లు.
గార్ల 9,380 రైతులకు రూ.7.71 కోట్లు.
గూడూరు 13,732 రైతులకు రూ.11.30 కోట్లు
ఇనుగుర్తి 6,102 రైతులకు రూ.4.78 కోట్లు
కేసముద్రం 15,377 రైతులకు రూ.11.78 కోట్లు
కొత్తగూడ 9,478 రైతులకు రూ.9.02 కోట్లు
మహబూబాబాద్ 18,588 రైతులకు రూ.14.11 కోట్లు
నెల్లికుదురు 16,406 రైతులకు రూ.13.13 కోట్లు
చిన్నగూడూరు 5,345 రైతులకు రూ.4.31 కోట్లు
దంతాలపల్లి 9,415 రైతులకు రూ.7.76 కోట్లు
డోర్నకల్ 13,342 రైతులకు రూ.10.73 కోట్లు
కురవి 13,966 రైతులకు రూ.11.39 కోట్లు
మరిపెడ 22,280 రైతులకు రూ.17.58 కోట్లు
నర్సింహులపేట 9,436 రైతులకు రూ.7.50 కోట్లు
పెద్దవంగర 10,083 రైతులకు రూ.8.10 కోట్లు
సీరోల్ 7,390 రైతులకు రూ.5.91 కోట్లు
తొర్రూరు 16,881 రైతులకు రూ.13.10 కోట్లు
రైతుల్లో హర్షం
రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయుక్తంగా ఉంటాయని రైతులు తెలిపారు.
వ్యవసాయానికి ఊతం
రైతు భరోసా నిధులు సమయానికి విడుదల కావడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నిధులతో పంటలసాగు మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.






