14-11-2025 07:31:09 PM
ఉత్సాహంగా విద్యార్థుల ప్రదర్శనలు
దేవరకొండ,విజయక్రాంతి: కొండమల్లెపల్లిలోని జేబీ కాలనీలో ఉన్న ఎస్కేఎస్ జీనియస్ స్కూల్ లో శుక్రవారం రోజున బాలల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా, ఉల్లాసంగా నిర్వహించారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను స్మరించుకుంటూ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనిత కుమారి మాట్లాడుతూ... పిల్లలు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, తమలోని అంతర్గత ప్రతిభను వెలికితీయాలని, క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఉద్భోదించారు. ఎస్కేఎస్ జీనియస్ స్కూల్లో నిర్వహించిన ఈ బాలల దినోత్సవ వేడుకలు విద్యార్థులకు చిరస్మరణీయమైన అనుభూతిని, రెట్టింపు ఉత్సాహాన్ని అందించాయని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది.