calender_icon.png 13 June, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయానికి నాంది... నిందితులకు శిక్షలు

11-06-2025 11:42:23 PM

జిల్లా పోలీసుల కృషికి న్యాయవ్యవస్థ ప్రశంస..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి జానకి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): న్యాయానికి నిలువెత్తు నిదర్శనం నిందితులకు శిక్షలు ఖరారు అయినప్పుడేనని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇలాంటి ప్రశంస జిల్లా పోలీసులు చేసిన కృషికి న్యాయ వ్యవస్థ ప్రత్యేకంగా ప్రశంసించింది. మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District)లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణలు ముగిసి నిందితులకు శిక్షలు విధించబడినవి. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల నిష్ఠ, నిబద్ధత, న్యాయ వ్యవస్థ యొక్క స్పందన పలువురి ప్రశంసలకు తావివ్వడం జరుగుతుంది.

దేవరకద్ర పోలీస్ స్టేషన్(Devarakadra Police Station) నందు 2020లో నమోదైన Cr.No.24/2020 U/s 307 r/w 34 IPC కేసులో  నిందితులు A1 హరిజన్ రవి, A2 డొంగుల నరేష్, A3 గుడె గోపాల్ కు ఈ కేసులో న్యాయమూర్తి శ్రీమతి గుండ్ల రాధిక అదనపు సహాయ సెషన్స్ కోర్టు, మహబూబ్ నగర్ నందు ఈ రోజు 4 సంవత్సరాల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.2,000/- చొప్పున జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. సీసీ కుంటకు సంబంధించిన Cr.No.03/2019 U/s 326 IPC కింద  పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసులో నిందితుడు కమ్మరి జగతయ్యకు ఈ కేసులో మూడవ అదనపు జూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ మొహమ్మద్ మునావర్ హుస్సేన్ నిందితుడికి 3 సంవత్సరాల శిక్ష, రూ.5,000/- జరిమానా విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి మాట్లాడుతూ... నేరం జరిగిన ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు తగిన శిక్ష విధించాలన్నదే జిల్లా పోలీసుల లక్ష్యమని, ఈ రెండు కేసుల్లో విచారణాధికారులు, దేవరకద్ర కేసునందున్యాయం సాధించేందుకు కృషి చేసిన విచారణాధికారి ఎ.వెంకటేశ్వర్లు SIP (f), ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ బి.నాగన్న SIP, పోలీసు సిబ్బంది రఘు PC 2195, HC బి.నాగిరెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భక్త్యార్ బాబా  న్యాయ వ్యవస్థ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. సి సి కుంట కేసులో న్యాయం జరగేందుకు కృషి చేసిన విచారణ అధికారి ఎం.అంజనేయులు SIP (f), సీసీ కుంటా పోలీస్ స్టేషన్, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ ఏ.రాంలాల్ SIP, సీడీఓ వి.శివకుమార్, అలాగే కేసు పక్షాన వాదన నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్.బాబు రావు, రామకృష్ణ లకు అభినందనలు తెలిపారు.