15 March, 2026 | 1:39 PM

ఏసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్

22-06-2025 12:38 AM

బూర్గంపాడు, జూన్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం లంచం తీసుకుం టూ జూనియర్ అసిస్టెంట్ సీహెచ్ నవక్రాం త్ ఏసీబీకి పట్టుబడ్డాడు. లబ్ధిదారుడి రేషన్‌కార్డ్ నమోదు చేసి ప్రాసెస్ చేయడానికి ఒక రి నుంచి రూ.4వేల లంచం డిమాండ్ చేశా డు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు శనివారం నవ క్రాంత్‌కు రూ.2,500 లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ పట్టుకున్నారు.