calender_icon.png 12 November, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేస్తేనే 317 జీవో బాధితులకు న్యాయం

01-12-2024 12:13:51 AM

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): నూతన రాష్ట్రపతి ఉత్త ర్వులు-2018ని పూర్తిగా రద్దు చేస్తేనే 317 జీవో బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్(జీటీఏ) అధ్యక్షుడు ఎం వీరాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 371(డి)కి వ్యతిరేకమ న్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ 1975లో తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.