19 May, 2026 | 11:26 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

మంత్రివర్గ విస్తరణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి

12-12-2024 10:52 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణలో సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో ఎవరి వాటా వారికే దక్కాలనే సామాజిక న్యాయం నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి వర్గంలో రెడ్లకు, వెలమలకు మాత్రమే న్యాయం జరిగిందని అన్నారు. విస్తరణలో మంత్రి పదవులు మళ్లీ అగ్రకులాలకు కట్టబెడితే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.

ప్రస్తుత మంత్రి వర్గంలో మార్పులు చేయాలని అన్నారు. బడుగుల సంక్షేమం అగ్ర కులాలు చూడరని అన్నారు. గౌడ కులస్తులకు చెందాల్సిన ఎక్సైజ్ శాఖను వెలమ కులానికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు అన్యాయం జరిగితే సహించబోమని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కులవృత్తులు చేసుకునే ఆయా సామాజిక వర్గాల వారికే మంత్రి పదవులు కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ కులాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేషా చారీ, బాలగోని బాలరాజు గౌడ్, తాటికొండ విక్రం గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అయిలు వెంకన్ గౌడ్ పాల్గొన్నారు.