ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కేకే..?
04-07-2024 01:23 PM
హైదరాబాద్: అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి కే కేశవరావు రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావుకు కాంగ్రెస్‌లో కీలక పదవి ఇస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయనకు త్వరలో పార్టీలో జాతీయ స్థాయిలో పెద్ద పదవి వచ్చే అవకాశం ఉంది.






