ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి జూపల్లి నల్లమల టూర్
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలపై అధ్యయనం
రెండు రోజులపాటు అధికారులతో కలిసి అడవిలోనే..
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఆహ్లాదం, పర్యాటక ప్రదేశాలలో ఒకటైన నల్లమల అటవీ ప్రాంతాలను ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజులపాటు పర్యటించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అంశాలపై కులం కుశంగా చర్చించనున్నట్లు తెలిపారు. పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేసేందుకు ఈ టూర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు పర్యాటక ప్రదేశాల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎకో టెంపుల్, రివర్ టూరిజం, సముహాల అభివృద్ధి, వసతుల కల్పనపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో పాటు, ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటించనుంది.






