నిరుద్యోగులను మోసం చేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వమే
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తోంది. 5 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రస్ కు 8 సీట్లు వచ్చాయని నిజామాద్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని(Congress government) ఆరోపించారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించామని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ను కాదని మార్పు కోసం కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆయన ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఒక్క డీఏ చెల్లించి ఐదు డీఏలు బకాయి పడిందని పేర్కొన్నారు. మంత్రులు కమీషన్లు గురించి మాట్లాడుతున్నారు.




