కల్వకుర్తి రైతుల సమస్యలపై గళమెత్తాలి

12-09-2026 | 05:37pm

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

​అమనగల్లు,(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం(Kalvakurthi Constituency)లో సాగునీటి అభద్రత, విద్యుత్ కోతలతో అల్లాడుతున్న రైతులకు(farmers ) అండగా నిలిచి నిరంతరం పోరాటాలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లో మంచిరేవుల ఆయన నివాసంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్  చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్,జిల్లా నాయకులు అనిల్, కృష్ణారెడ్డిలు ఆయనను కలిసారు.

ఈ సందర్బంగా క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్(Kalvakurthi Lift Irrigation) ద్వారా కాలువలకు ఆయకట్టుకు నీరు ఇవ్వడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో సైతం చెరువులు నింపి పంటలను కాపాడిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని గుర్తుచేశారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని నిరంజన్ రెడ్డికి వివరించారు.​రైతుల ఇబ్బందులపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి నాయకులకు సూచించారు.

మరిన్ని వార్తలు