15 May, 2026 | 2:48 PM

Breaking News

సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •   నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •  

కమలానే కాబోయే అధ్యక్షురాలు

21-10-2024 12:00 AM
  1. చరిత్రాత్మక తీర్పునకు అమెరికా సిద్ధంగా ఉంది
  2. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: చరిత్రాత్మక తీర్పునిచ్చేందుకు అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.  డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఒబామా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై నిప్పులు చెరిగారు.

ట్రంప్ ఎప్పుడూ తన అహం, డబ్బు, హోదా గురించి మాత్రమే పట్టించుకుంటాని విమర్శించారు. మధ్యతరగతిలో పెరిగిన కమలా హారిస్.. కళాశాలలో ఉన్నప్పుడు తన ఖర్చులను చెల్లించడానికి మెక్‌డొనాల్డ్‌లో పనిచేసింది. ఆమెకు కష్టం అంటే ఏంటో తెలుసు. ఈ దేశాన్ని నడిపించగల శక్తి, సామర్థ్యాలు ఆమె దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మీరు కమల, టిమ్‌ను ఎన్నుకుంటే వారు మీ సమస్యలపై దృష్టి పెడతారు అని ఒబామా అన్నారు.