calender_icon.png 12 February, 2026 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కన్నెర్ర..

12-02-2026 05:39:09 PM

కాగజ్ నగర్ లో భారీ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై కార్మిక గర్జన సిఐటియు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం బాల భారతి హై స్కూల్ నుండి బారి కార్మిక ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, పొట్టి శ్రీరాములు విగ్రహం, అంబేద్కర్ చౌక్ మీదుగా స్థానిక స్టేట్ బ్యాంకు ముందు వరకు ర్యాలీ జరిగింది.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ అయితే సభలో సిఐటియు సీనియర్ నాయకులు ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజల కష్టార్జితమైన దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందిఅని, పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు.

సామాన్య ప్రజలను విస్మరించి, కేవలం సంపన్నుల ప్రయోజనాల కోసమే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి ఏకం కావాలి అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కన్వీనర్ ముంజం. ఆనంద్ కుమార్ ఆదివాసీ గిరిజన సంఘము జిల్లా ఉపాధ్యక్షులు కోట. శ్రీనివాస్ లు మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో ఉంది... కార్మికులు సమ్మెలో ఉంటే ఇక్కడికి ఎందుకు రాలేదు..? "రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది - గిట్టుబాటు ధర రైతు హక్కు!"లు దక్కుతుందని, అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని కట్టబెట్టేలా విధానాలు రూపొందిస్తున్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతోనైనా మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి." డిమాండ్ చేశారు.