calender_icon.png 12 February, 2026 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొరపాట్లు లేకుండా కౌంటింగ్ పూర్తి చేయాలి

12-02-2026 05:43:36 PM

- అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి 

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మండల కేంద్రంలో గల సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి సందర్శించి డివిజన్ పరిధిలో కొనసాగుతున్న పనులు, ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. కార్యాలయంలోని విభాగాలను పరిశీలించి కార్యాలయ సొంత భవనం నిర్మాణం కొరకు స్థలాన్ని  గుర్తించాలని అధికారులకు సూచించారు. రాంనగర్ లోనే పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

- కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలన

బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. 13వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన త్రాగునీరు, ఇతర ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఆయన వెంట బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసిల్దార్ కృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.