21 March, 2026 | 3:11 PM

కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు

21-03-2026 12:00 PM

హైదరాబాద్: కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ(Karimnagar Two Town SI) చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త గారింట్లో ఉరివేసుకుని చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ చంద్రశేఖర్ భార్య ఇటీవల గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామం సీతంపేటలో ఎస్ఐ చంద్రశేఖర్ ఉంటున్నాడు. భార్య మృతితో మనస్తాపానికి గురై అత్త గారింట్లో చంద్రశేఖర్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు మరణించడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.