21 March, 2026 | 1:29 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత

21-03-2026 11:48 AM

ప్రపంచ మార్కెట్లలోకి 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు

యుద్ధం వేళ ఇంధన సరఫరాపై ట్రంప్ కీలక నిర్ణయం

వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న వేళ ట్రంప్(US President Donald Trump) సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇరాన్ చమురుపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసింది. యుద్ధం వేళ ఇంధన సరఫరాలపై ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్(Iranian oil) చమురుపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు సరఫరాను పెంచేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్ లోకి రానుంది.