యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్.. పండగ పూట తీవ్ర విషాదం
హైదరాబాద్: ఇద్దరి మధ్య ప్రేమ(Love) ఒక యువకుడి ప్రాణం తీసింది. ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురైన 23 ఏళ్ల యువకుడు నేరెడ్‌మెట్ పోలీస్ పరిధిలోని ఓల్డ్ సఫిల్‌గూడలో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు నరేష్ తను ప్రేమించిన యువతి తల్లి వాళ్ల పెళ్లి ప్రతిపాదనను(Marriage proposal) నిరాకరిండంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఆ తిరస్కరణను తట్టుకోలేక, అతను ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఉగాది పండుగ నిమిత్తం తన స్నేహితుడు స్వగ్రామానికి వెళ్లడంతో, నరేష్ తన గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి తన రూమ్‌మేట్ తిరిగి వచ్చినప్పుడు, నరేష్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. నరేష్ తన ఆత్మహత్యకు గల కారణాన్ని రాసిన లేఖను నేరెడ్‌మెట్ పోలీసులు(Neredmet Police) సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




