సీఎంతో కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ కమిటీ
ఎల్బీనగర్: కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ కమిటీ నూతన చైర్మన్, ధర్మకర్తలు తదితరులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Former MP Madhu Yashki Gowda) ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఆలయ ఈవో లావణ్య, ఆలయ ధర్మకర్తలు దుర్గారెడ్డి, ప్రవీణ్ గౌడ్, రవీందర్ రెడ్డి, కిరణ్, గోపాల్ రెడ్డి, నరేష్, కవిత, విష్ణువర్ధన్ రెడ్డి, పూల నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ కుమార్, శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఈశ్వరమ్మ యాదవ్, నల్ల రఘుమా రెడ్డి , డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






