30 June, 2026 | 11:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

‘కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన’

30-04-2025 12:00 AM
  1. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర పోస్టు
  2. పర్యాటక శాఖలో పని చేయడం గర్వంగా ఉంది

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఇటీవల బదిలీ వేటుకు గురైన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్ మంగళవారం చివరిరోజు విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖలో పని చేయడాన్ని ‘ఎక్స్’ వేదికగా భగవద్గీత శ్లోకమైన ‘కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన’ అని పంచుకున్నారు.

‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గానీ, ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు; అలాగని కర్మలు చేయడం మానకు’ అని దీనర్థం. టూరిజం శాఖలో నాలుగు నెలల పని చేయడం గర్వంగా, గౌరవంగా ఉందన్నారు. ఒక అధికారిగా తాను చేయగిలిగినంత చేశానని, రాష్ట్రానికి తొలిసారి 2025-30 పర్యాటక విధానాన్ని తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు.

ఈ విధానం నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షిం చేందుకు బలమైన పునాదిని సృష్టిస్తుందన్నారు. పర్యాటక శాఖ పని శైలిని పునరుద్ధరించడంతో పాటు జవాబుదారీతనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్త కార్యక్రమం కోసం ఇది కచ్చితంగా మరిన్నింటికి తలుపులు తీస్తుందని పేర్కొన్నారు.

కాగా స్మితా సబర్వాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సాంస్కృతిక శాఖ నుంచి ఫైనాన్స్ కమిషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో కొందరు ఏఐతో సృష్టించిన ఫేక్ ఫోటోను రీట్వీట్ చేయడంతో పోలీసులు స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆమె రీట్వీట్ చేస్తూ.. తనలాగే 2వేల మంది రీట్వీట్ చేశారని.. వాళ్లను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారా అని స్మితా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.