5 May, 2026 | 11:18 AM

కర్ణాటక వ్యాపారవేత్త ముంతాజ్ అదృశ్యం

07-10-2024 12:15 AM

బెంగళూరు, అక్టోబర్ 6: కర్ణాటక కు చెందిన వ్యాపారవేత్త  బీఎం ముం తాజ్ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్నది. వ్యాపారవేత్త కోసం అక్కడి పోలీసు వర్గాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మంగళూరు పోలీస్ కమిషనర్ అనుసమ్ అగర్వాల్  వివరాలు వెల్లడించారు. మంగళూరు మాజీ ఎమ్మెల్యే మొయిదీన్ బవ సోదరుడు, వ్యాపారవేత్త బీఎం ముంతాజ్  ఆదివారం తెల్లవారుజామున కారు లో ఓ చోటికి బయల్దేరాడు.

మార్గమధ్యంలో ఏమైందో తెలియదు గానీ కొద్దిసేపటి తర్వాత కులూరు వంతెన సమీపంలోని స్థానికులు అతడి కారు ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వంతెన పైనుంచి కిందికి దూకి  బీఎం ముంతాజ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సందేహిస్తున్నా రు.

బీఎం ముంతాజ్ ఇంటి నుంచి బయల్దేరిన తర్వాత మార్గమధ్యంలో కారు యాక్సిడెంట్‌కు గురైందని గుర్తించారు.బీఎం ముంతాజ్ ఆచూకీ కోసం పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపకశాఖ సిబ్బంది, కోస్ట్‌గార్డ్ టీం గాలిస్తు న్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీపీ వెల్లడించారు.