5 May, 2026 | 12:38 PM

పంజాబ్‌లో నేతల మధ్య ఘర్షణ

07-10-2024 12:17 AM

ఆప్ లీడర్‌కు బుల్లెట్ గాయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్ నేతల గొడు వ జరిగింది. ఈ ఘటనలో ఆప్ నాయకుడు మన్‌దీప్ సింగ్ బ్రార్‌కి బుల్లెట్ గాయమైనట్లు పోలీసులు తెలిపారు. అకాళీదళ్ నాయకుడు వర్దేవ్ సింగ్ మాన్ ఓ పాఠశాలకు సంబంధించిన ఫైల్ గురించి బీడీపీఓ ఆఫీస్ కు వెళ్లారు. సదరు ఫైల్‌ను చూసేందు కు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగారు.

ఈక్రమంలో బయట ఉన్న ఆప్ నేత మన్‌దీప్ సింగ్ బ్రార్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమం లో మన్‌దీప్ శరీరంలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. బాధితుడిని వెంటనే జలాలాబాద్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అకాళీదళ్  నాయకులే ఈ ఘటనకు కారణమని ఆప్ పార్టీ అధికార ప్రతినిధి మల్వీంద ర్ సింగ్ కాంగ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్‌ఏడీ పార్టీ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా ఈ నెల 15న ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.