17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కమల్ హాసన్ కు చివాట్లు పెట్టిన కర్ణాటక హైకోర్టు

03-06-2025 03:50 PM

కర్ణాటక: నటుడు కమల్ హాసన్ సామాన్య వ్యక్తి కాదు.. ఇష్టానుసారంగా మాట్లాడురాదని కర్ణాటక హైకోర్టు మండిపడ్డింది. కన్నడ భాషపై ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారని, కమల్ ఏమైనా చరిత్రకారుడా అని హైకోర్టు ప్రశ్నించింది. కర్ణాటక ప్రజలకు ఒక క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుంది కదా, క్షమాపణ కోరితే చెప్పకుండా రక్షణ కావాలని కోరుతూ కోర్టు వచ్చారని కోర్టు చివాట్లు పెట్టింది. భావప్రకటన స్వేచ్ఛ ఉన్నా.. సెంటిమెంట్ ను దెబ్బతీసెలా మాట్లాడకూడదని కోర్టు సూచించింది. జూన్ 5వ తేదీని థగ్ లైఫ్ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కన్నడ భాష.. తమిళం నుంచి  పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ మద్దతు దారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు. తన సినిమాను అడ్డుకోకుండా రక్షణ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.