5 May, 2026 | 8:35 PM

Breaking News

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •  

సెమీస్‌లో కర్ణాటక, మహారాష్ట్ర

12-01-2025 12:00 AM

విజయ్ హజారే ట్రోఫీ

వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీలో నాలుగుసార్లు చాంపియన్ కర్ణాటకతో పాటు మహారాష్ట్ర సెమీస్‌లో అడుగు పెట్టింది. శనివారం జరిగిన తొలి క్వారర్స్‌లో మహారాష్ట్ర 70 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (107) సెంచరీతో అలరించాడు. అనంతరం పంజాబ్ 44.4 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది. అన్మోల్‌ప్రీత్ (48) టాప్ స్కోరర్. ముకేశ్ 3 వికెట్లు తీశా డు. బరోడాతో జరిగిన మరో క్వారర్స్‌లో కర్ణాటక ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్ పడిక్కల్ (102) సెం చరీ సాధించాడు. అనంతరం బరోడా 49.5 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో గుజరాత్ తో హర్యా నా, విదర్భతో రాజస్థాన్ ఆడనున్నాయి.