calender_icon.png 13 May, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

22-04-2025 12:54:57 AM

  1. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు
  2. ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌కు వచ్చిన రాజశేఖర్‌రెడ్డిని సోమవారం ఎయిర్‌పోర్టు బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు.

మంగళవారం విచారణకు హాజరవుతానని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నప్పటికీ అనుమానం వ్యక్తం చేసిన సిట్ తమ వెంట రావాల్సిందేనంటూ బలవంతంగా వాహనం ఎక్కించి విజయవాడకు తరలించారు. మరోవైపు ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. తదుపరి విచారణను  వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణకు హాజరవుతానని ఆడియో సందేశాన్ని విడుదల చేసిన కాసేపటికే ఏపీ సిట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.