calender_icon.png 13 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్యం అందించాలి

22-04-2025 12:55:20 AM

  1. పిడుగుపాటుకు గాయాలైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే 

తక్షణ సహాయంగా 20 వేలు 

గోపాలపేట ఏప్రిల్ 21: ఇటీవల ఉరుములు మెరుపులతో పడిన పిడుగుపాటుకు గాయాలైన క్షతగాత్రులను వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి పరామర్శించారు. సోమవారం గోపాలపేట మండలం చాకలి పల్లి లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఆదివారం సాయంకాలం భీభత్సంగా ఈదురుగాళ్లు రూములు మెరుపులతో పిడుగు పడడం వల్ల విశ్వనాథం చెందిన 25 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి దాంతోపాటు అక్కడ ఉన్న ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని ఎమ్మెల్యే పరామర్శించారు.

గాయాలైన విశ్వనాథ్ భార్యను వనపర్తి ఏరియా ఆసుపత్రికి పంపించు మెరుగైన వైద్యం చేయించుకోవాలని తెలిపారు. గొర్రె పిల్లలు మృతి చెందడంతో తాసిల్దార్, హర్షవర్ధక శాఖ అధికారులకు తెలిపి వారికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సూచించారు. అనంతరం విశ్వనాథం కి తక్షణ సహాయంగా 20 వేల రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ తిలక్ రెడ్డి, సత్య శిలారెడ్డి,కోటిరెడ్డి, రాజ రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు.