14 July, 2026 | 11:51 PM

మార్కెట్ల శుభ్రత మా బాధ్యత

14-07-2026 11:51 PM
  1. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అవగాహన కల్పిస్తాం 
  2. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి- 
  3. ఎన్టీఆర్ వ్యవసాయమార్కెట్‌లో స్వచ్ఛతా కార్యక్రమం 

ఎల్బీనగర్, జులై 14 : మార్కెట్ యార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,మార్కెట్ కి వచ్చే రైతులకు,వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు.

మార్కెట్ ను దాదాపు పూర్తి స్థాయిలో శుభ్రం చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు, వ్యాపారాలు, కొనుగోలుదారు మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరక్టర్లు బండి మధుసూదన్ రావు, మెగావత్ గణేష్ నాయక్, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, నాయకులు నవీన్, శేఖర్, సాయి, భార్గవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.