లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సీఐ, ఎస్సై

17-09-2026 | 11:08am

మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 5లక్షలు లంచం తీసుకుంటూ కీసర సిఐ(Keesara CI) ఆంజనేయులు, ఎస్సై(SubInspector) జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ. 10లక్షలు డిమాండ్ చేయగా, రూ. 5లక్షలకు ఒప్పందం కుదిరింది. పోలీసు అధికారు లు వివిధ రకాలుగా బాధితుడిని వేధించడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం అర్ధరాత్రి కీసర చెరువు వద్ద కారులో ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి రూ. ఐదు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై అక్కడి నుంచి పరుగులు తీసినట్టు తెలిసింది. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న సమయంలోనే ఎస్సై లంచం స్వీకరించినట్లు తెలిసింది. కీసర పోలీస్ స్టేషన్లో, సిఐ, ఎస్సై ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మసీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. సీఐ ఆంజనేయులు సూచన మేరకే ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి లంచం స్వీకరించినందున ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు