1 April, 2026 | 2:25 PM

Breaking News

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •  

కెన్యా స్కూల్ అగ్నిప్రమాదంలో 21కి చేరిన మృతులు

09-09-2024 12:00 AM

నైరోబీ (కెన్యా), సెప్టెంబర్ 8: కెన్యాలోని నైరీ కౌంటీలో ప్రాథమిక పాఠశాల హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. గురువారం అర్ధరాత్రి హాస్టల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ హాస్టల్‌లో 9 ఏళ్ల వయసున్న 156 మంది చిన్నారులు నిద్రిస్తుండగా ఈ ప్రమా దం జరిగింది. ఘటనాస్థలంలో 19 మంది మృతదేహాలు లభించాయని ప్రభు త్వం తెలిపింది. మిగిలినవారిని ఆసుపత్రికి తరిలించి నట్లు తెలిపారు.

చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరో ఇద్దరు చిన్నారులు చని పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన అధికారులు.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కెన్యాలోని పాఠశాలల్లో తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నట్లు జాతీయ కమిషన్ చెబుతోంది.