15 April, 2026 | 6:31 PM

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెరపైకి కొత్త పేరు

15-04-2026 03:02 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్(Moinabad Drugs Case) కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో తెరపైకి కేదార్ పేరు వచ్చింది. గతేడాది డ్రగ్స్ ఓవర్ డోస్ తో కేదార్ దుబాయ్ లో మృతి చెందాడు. కేదార్ తో రోహిత్ రెడ్డి సోదరులకు సంబంధాలున్నట్లు  కస్టడీ రిక్వెస్ట్ కాపీలో పోలీసులు వెల్లడించారు. కేదార్ కు రోహిత్ రెడ్డి మధ్య అనేక లావాదేవీలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీ నిర్వాహకులకు చాలా సార్లు డబ్బులు పంపినట్లు ఆధారాలు సేకరించామని పోలీసులు వివరించారు. రోహిత్, రితేష్ బ్యాంక్ ఖాతాల నుంచి కేదార్ కు  రూ. 25 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. రూ. 25 లక్షల లావాదేవీల గురించి కూడా విచారించామని పోలీసులు సూచించారు. కేదార్ తో లావాదేవీలపై ప్రశ్నించినప్పుడు రోహిత్, రితేష్ సరిగ్గా సమాధానాలు చెప్పలేదని పోలీసులు వెల్లడించారు.