2 March, 2026 | 3:22 PM

Breaking News

వ్యక్తి హత్య, ముక్కలు ముక్కలుగా చేసి యమునా నదిలో..   •   అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం   •   హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం   •   భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు   •   తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు   •   మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత   •   చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్   •   అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి   •   సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం   •   ఫార్మా కంపెనీల అనుమతుల రద్దు కోరుతూ ప్రజావాణిలో వినతి   •  

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

20-09-2024 03:39 PM

హైదరాబాద్: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 2020లో ముంబయిలోని హోటల్ లో జానీ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు చెప్పారు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. లైంగిక దాడి విషయం బయటకు రాకుండా జానీ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తామని జానీ బెదిరించినట్లు తెలిపారు. పలుకుబడితో బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశాడని పోలీసులు పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.