26 June, 2026 | 1:34 AM

కిలోన్నర గంజాయి పట్టివేత

26-06-2026 12:00 AM

పటాన్‌చెరు, జూన్ 25 : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అమీన్పూర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బిహెచ్‌ఈఎల్ బస్టాప్ సమీపంలో ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద 1.56 కేజీల ఎండు గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ రుహిల్ అమిన్,షేక్ మొజాయిద్దీన్ ఇస్లాంలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.