పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా విధులు నిర్వహించాలి
సత్వర న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
బోధన్, జూన్ 25 (విజయక్రాంతి): పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా పోలీస్ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. గురువారం ఆయన కోటగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీస్ విభాగము నిర్విరామముగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.కోటగిరి పి.ఎస్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ , అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ సరిహద్దులో మహారాష్ట్ర ఉన్నందున వాహనాల రాకపోకలపై ఎల్లప్పుడూ నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎ.సి.పి పి. శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్త్స్ర జి. శ్రీనివాస్ యాదవ్ సిబ్బంది పాల్గొన్నారు.






