యువతిని కాపాడిన కిమ్స్ వైద్యులు
లివర్ మార్పిడి లేకుండానే వెబర్ క్రిస్టియన్ వ్యాధికి చికిత్స
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఆమెకు ప్రపంచంలోనే అరుదైన లివర్ సమస్య వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 19వ కేసు మాత్రమే. ఇక అంతర్జాతీయ ప్రమాణాలు ప్రకారం ఆమె బ్రతకాలాంటే కచ్చితంగా లివర్ మార్పిడి చేయాలి. కానీ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఎటువంటి లివర్ మార్పిడి అవసరం లేకుండానే రుమటాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాల సమ న్వయంతో విజయవంతంగా చికిత్సనందిం చి ఆమెకు పునర్జన్మను అందించారు.
క్లినికల్ డైరెక్టర్ రుమటాలజీ మరియు క్లినికల్ ఇ మ్యునాలజీ విభాగం డాక్టర్ వి. శరత్ చంద్ర మౌళి మరియు డైరెక్టర్ - హెపటాలజీ, ట్రా న్స్‌ప్లాంట్ హెపటాలజీ డాక్టర్ కె ఎన్ చంద న్ కుమార్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన యువతి (26) అత్యంత అ రుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధిగా గుర్తింపు పొందిన వెబర్ క్రిస్టియన్ డిసీజ్ కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెబర్ క్రిస్టియన్ వ్యాధి అంటే చర్మం కింద ఉండే కొ వ్వు పొరల్లో వాతము(ఇన్ఫ్లమేషన్) కలిగించే ఒక అరుదైన వ్యాధి.
ఈ యువతికి 2018లో చేతులు, కాళ్లపై నొప్పితో కూడిన గడ్డలు, తర చూ జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో రుమటాలజీ విభాగానిలోని డాక్టర్ శరత్ చంద్ర మౌళి నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించి ఆమెకు వెబర్ క్రిస్టియన్ సిండ్రోమ్ గా నిర్ధారించారు. కొద్ది రోజుల్లోనే ఆమెకు గ్రేడ్-4 హెపా టిక్ ఎన్సెఫలోపతి అనే ప్రమాదకర స్థితి ఏర్పడింది. అంటే లివర్ పనిచేయకపోవడం వలన మెదడుపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.
దీంతో వెంటనే లివర్ ఐసీయూకు తరలించి, హెపటాలజీ, లివర్ మార్పిడి నిపుణుడు డాక్టర్ కె.ఎన్. చందన్ కుమార్ నేతృత్వంలోని బృందం చికిత్స ప్రారంభించింది. రోగి ని వెంటిలేటర్ పై ఉంచి మెదడు వాపు నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు ప్లాస్మాఫెరెసిస్ ద్వారా ఎక్స్ట్రాకార్పోరియల్ లివర్ సపోర్ట్ అందించారు. వైద్య పరీక్షల్లో ఆమె కింగ్స్ కాలేజ్ క్రైటీరియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో అత్యవసర లివర్ మార్పిడి అవసరమని భావించారు.
వెబర్ క్రిస్టియన్ అనే జబ్బు లివర్ కు సోకి ఫల్మినెంట్ హెపటిక్ ఫెయిల్యూర్ ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలలో ప్రపంచం లో కేవలం 3 మందికి మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు రుమటాలజీ, హెపటాలజీ, లివర్ మా ర్పిడి ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్ విభాగాల నిపుణులు సమన్వయంతో పనిచేశారు.
కొద్ది రోజుల చికిత్స అనంతరం రోగిలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం ప్రారంభమై, లివర్ పనితీరు క్ర మంగా మెరుగుపడింది. న్యూరోలాజికల్ పరిస్థితి కూడా స్థిరపడటంతో వెంటిలేటర్ నుంచి తొలగించి ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించి, సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేశారు.






