‘మిస్ టీన్ యూఎస్‌ఏ’గా కిరణ్‌రెడ్డి
50 మందిని వెనక్కినెట్టిన భారత సంతతి అందగత్తె
మిస్ టీన్ యూనివర్స్‌లో అమెరికా తరఫున ప్రాతినిధ్యానికి సిద్ధం
వాషింగ్టన్, సెప్టెంబర్ 4: అమెరికా జాతీయ స్థాయి అందాల పోటీల్లో భారత సంతతికి చెందిన కిరణ్ రెడ్డి ‘మిస్ టీన్ యూఎస్(Miss Teen USA)’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. జూలైలో ఫ్లోరిడాలోని మియామిలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో ఆమె తళుక్కుమన్నారు. 50 రాష్ట్రాల నుంచి వచ్చిన అందగత్తెలను కిరణ్ రెడ్డి ఓడించారు.
జార్జియా రాష్ట్రం డగ్లస్‌లోని కాఫీ కౌంటికి చెందిన ఈమె యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో బయాలజీ విభాగంలో చేరి ఇటీవలే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 2024లో మిస్ జార్జియా టీన్ యూఎస్‌ఏ పోటీల్లో పాల్గొని రెండోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది అక్టోబర్ కాంబోడియాలో జరిగే మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లోనూ అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.






