ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్
29-10-2024 10:47 AM
హైదరాబాద్: ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్ చేరుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ విద్య భవన్ పాఠశాలలో రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మనం 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. దేశాభివృద్ధికి యువశక్తిని ఉపయోగించుకోవడం అవసరం అన్ని కిషన్ రెడ్డి 2047 వరకు వికసిత్ భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. ఉగ్ర మూలాలను ఉక్కుపాదంతో అణచివేశామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.




