పదేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న ఏకైన ప్రధాని.. మోడీ
మనం ఎన్నో అద్భుతాలు చేయవచ్చు
ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిదండ్రులు, మాతృభాష మరవద్దు
హైదరాబాద్: పదేళ్లుగా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఏకైన ప్రధాని నరేంద్ర మోడీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ విద్య భవన్ పాఠశాలో రోజ్ గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఎంపికైన 155 యువతకు నియామక పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతలు సరిగా లేకుంటే దేశంలోకి పెట్టుబడులు రావన్నారు. ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ విధానాల్లో మార్పులు తెస్తున్నామన్నారు. విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం.. విద్యుదుత్పత్తి పెంచి అన్ని రంగాల అభివృద్ధికి సహకరిస్తున్నామని వెల్లడించారు.
వికసిత్ భారత్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం.. వచ్చే 25 ఏళ్లపాటు మనకు అమృత కాలమని మోడీ అంటారని కిషన్ రెడ్డి తెలిపారు. యవశక్తి సాయంతో మనం ఎన్నో అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. అనేక దేశాల్లో యువత తగ్గుతోంది.. మనవద్ద యువశక్తి పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిదండ్రులు, మాతృభాష, పుట్టిన ఊరిని మరిచిపోకూదని సూచించారు. నేషన్ ఫస్ట్ అనేది గుర్తుంచుకుని పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ తో ఆలిండియా రేడియో ప్రాధాన్యతను మోడీ పెంచారని తెలిపారు. పోస్టాఫీసు నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటున్నామన్న కిషన్ రెడ్డి సైనికులతో కలిసి దీపావళి చేసుకోవాలని ప్రధాని తమను కోరినట్లు చెప్పారు.




