తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు.. పటేల్
29-10-2024 01:27 PM
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఏకతా దివస్ లో భాగంగా పటేల్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏడాదిపాటు ప్రతి గ్రామంలో పటేల్ జయంతి వేడుకలు చేస్తామన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు.. పటేల్.. నిజాం నవాబు మెడలు వంచిన ఘనుడు.. వల్లభాయ్ పటేల్ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏక్ పోలీస్ విధానంపై ఆయా సంఘాలు, కుటుంబాలతో చర్చించాలని సూచించారు. తెలంగాణలో బర్తరఫ్ చేసిన కానిస్టేబుళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.




