7 April, 2026 | 1:34 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

సొంత గూటికి చేరిన బాబు మోహన్

29-10-2024 01:54 PM

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలుగు దేశం పార్టీలో చేరారు. మంగళవారం నాడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రిగా పనిచేశాడు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నాడు. 

బాబు మోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందాడు. 2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్​ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి ప్రజా శాంతి పార్టీలో చేరాడు. అక్టోబర్ 29న  బాబూ మోహన్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.